యువకుల బలహీనతలే వాళ్ళకు బలం

యువకుల బలహీనతలే వాళ్ళకు బలం

‘కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రవీణ్‌‌‌‌ బ్యాచిలర్. ఎవరో దోస్త్ ఇచ్చిన నంబర్‌‌‌‌‌‌‌‌కు ఫోన్ చేశాడు. అవతలి నుంచి ఓ మహిళ స్వీట్‌‌‌‌ వాయిస్‌‌‌‌తో రిసీవ్ చేసుకుంది. మాట్లాడటంతోనే రూ.వెయ్యి పంపించమని అడిగింది. వెంటనే పదికిపైగా అమ్మాయిల ఫొటోలు పంపించింది. అందులోంచి సెలక్ట్ చేసుకోమంది. ఆ తర్వాత వారితో మాట్లాడించి ఓ అడ్రస్ చెప్పింది. ఈ వెంటనే మరో రెండు వేలు వేయమన్నారు. తీరా అడ్రస్‌‌‌‌కు వెళ్తే ఫోన్లు స్విచ్ఛాఫ్‍ వచ్చాయి. ఇక డబ్బులు పోగొట్టున్న ప్రవీణ్‌‌‌‌ లబోదిబోమన్నాడు.’

కరీంనగర్, వెలుగుట్రెండ్ మారుతోంది. ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు మోసాలకు పాల్పడడంలోనూ వినూత్న ఆలోచనలకు తెరతీస్తున్నారు. గతంలో లాటరీలు తగిలాయ్.. కారు గెలుచుకున్నారు.. దీన్ని పొందాలంటే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అంటూ డబ్బులు కట్టించుకునే వారు. కానీ నేడు టెక్నాలజీ పెరుగుతుంటే నయా మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి వ్యభిచారాన్ని అడ్డు పెట్టుకుని.. అమ్మాయిల వలలోకి దించి మోసం చేస్తున్నారు. ఓ కిలాడి ఫోన్ నంబర్లను కొంత మంది ద్వారా స్ప్రెడ్ చేసి.. ఆ నంబర్లకు ఫోన్ చేసిన వారికి కావల్సిన ఏరియాల్లో యువతులను ఏర్పాటు చేస్తామని నమ్మిస్తూ డబ్బులు గుంజుతోంది. కరీంనగర్ లోనూ చాలా మంది యువకులు ఇలా మోసపోయారు. ఎవరూ బయటకు చెప్పుకోలేకపోతున్నారు.

ఫొటోలు పంపించి.. డబ్బుల గుంజి..

ఇదో రకమైన సెక్స్ రాకెట్ అని చెప్పొచ్చు. గతంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కొన్ని నంబర్లు పెట్టి వాటికి ఫోన్,  వాట్సప్ ద్వారా అడ్రస్ చేస్తే అమ్మాయిలను సరఫరా చేసేవారు. దీని వల్ల పోలీసులకు దొరకడం.. పరువు పోవడం.. పైగా ఎన్నో ఇబ్బందులు వస్తుండడంతో ట్రెండ్‌‌‌‌‌‌‌‌ మార్చారు. దీంతో ఈ మధ్య కొంత మంది కిలాడీలు అమ్మాయిలను ఎరగా చూపిస్తూ డబ్బులు గుంజడమే పనిగా పెట్టుకున్నారు. మూడు ఫోన్ నంబర్లను విస్తృతంగా సోషల్ మీడియాల్లో ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా సరే ఈ నంబర్లకు కాల్ చేస్తే అమ్మాయిలను సరఫరా చేస్తామని చెప్తారు. నమ్మిన యువకులు తొలుత ఫోన్ చేయగానే.. ఏ  ఏరియాలో కావాలో అడుగుతారు. వెంటనే పది అందమైన యువతుల ఫొటోలను వాట్సప్‌‌‌‌‌‌‌‌కు సెండ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. అందులోంచి ఒక ఫొటోను సెలక్ట్ చేసుకున్న తరవాత.. అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌గా వెయ్యి పంపించాలని చెప్పడంతో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేయించుకుంటుంది. వెంటనే సదరు యువతితో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిస్తుంది. ఇలా ఫోన్లో మాట్లాడించడంతో చాలా మంది యువకులు నిజమేనని నమ్మి మోసపోతున్నారు.

ఎనీ టౌన్.. ఎనీ సెంటర్

సదరు మహిళ ప్రధానంగా యువకుల బలహీనతతో ఆడుకుంటోంది. ఫొటోలు పంపించి.. ఫోన్లో మాట్లాడించే సరికి నిజమేనని నమ్మి డబ్బులు ఆన్ లైన్ లో పంపిస్తున్నారు. ఇక ఎక్కడ కలవాలో అడ్రస్ కోసం అడిగితే యువకులు చెప్పిన టౌన్‌‌‌‌‌‌‌‌లో అక్కడ ఉండే ఒక ఫేమస్ హోటల్, సినిమా థియేటర్, హాస్పిటల్ పేరు ఇలా చెబుతారు.  అక్కడికి వెళ్లిన తరవాత యువతికి ఫోన్ చేస్తే డబ్బులు పూర్తిగా వేస్తేనే బయటకు వస్తానని చెబుతుంది. మిగిలిన డబ్బులు మరో రెండు వేలు కూడా ఆన్ లైన్ (ఫోన్ పే/గూగుల్ పే) ద్వారా చెల్లిస్తారు. అకౌంట్‌‌‌‌‌‌‌‌లో డబ్బులు పడిన తరువాత తిరిగి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. ఓ నాలుగైదు సార్లు ఫోన్ చేసి తాము మోసపోయామని గ్రహిస్తున్నారు. ఇలా రోజుకు వందల మంది వేల మొత్తంలో డబ్బులను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేస్తూ జేబులు గుల్లా చేసుకుంటున్నారు.

అంతా బోగస్.. 

ఈ ఫోన్ నంబర్ల ద్వారా జరిగే సంభాషణ.. ఆ తరువాత డబ్బులను అకౌంట్లలో వేయించుకున్న తర్వాత ఫోన్లు స్విచ్చాఫ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ రాకెట్ నడిపించేది కేవలం డబ్బుల కోసమే అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం యువకులను అమ్మాయిల పేరిట ముగ్గులోకి దింపి.. అందమైన అమ్మాయిల ఫొటోలను ముందుగా పంపించి డబ్బులు లాగడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్లు కూడా ట్రెండ్ మార్చారు. గతంలో ఫోన్ చేసిన వెంటనే కొన్ని ఫోటోలు పంపించే వారు.. కానీ ఇప్పుడు మాత్రం అడ్వాన్స్ గా వెయ్యి చెల్లిస్తేనే ఫొటోలు పంపిస్తామని కండిషన్ పెడుతున్నారు. సింపుల్‌‌‌‌గా ఒక్కొక్కరి నుంచి కనీసం రూ.3 వేలు గరిష్టంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొందరు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లలో చెప్పినా.. కేసులు నమోదు చేయడం లేదు. అమ్మాయిలను ఎరగా చూపుతూ మోసాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి.. వారి ఆటకట్టిస్తే భవిష్యత్‌‌‌‌లోనూ మరికొందరు యువకులు మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుంది.