వీడ్కోలు అంటే మామూలు వీడ్కోలు కాదు..కన్నీటి వీడ్కోలు.సొంత బిడ్డకు పెండ్లి చేసి సాగనంపుతున్నట్లుందీ ఆ వీడ్కోలు. చక్కగా అలంకరించి..పెండ్లికూతురిని చేసేటప్పుడు గౌరీ పూజ చేసి నట్లు సేమ్ టుం సేమ్ పూజలు నిర్వహించి ఘనంగా సాగనంపారు..15 యేండ్ల అనుబంధం మరీ.. ఆమాత్రం వీడ్కోలు ఎమోషన్ ఉంటుం ది. కర్ణాటకలోని ఓ గ్రామంలో బస్సు సర్వీస్ కు ఘనంగా వీడ్కోలు పలికారు గ్రామస్తులు. ఏళ్లపాటు సేవలందించిన బస్సుకు ప్రేమగా, భావోద్వేగంతో వీడ్కోలు పలికిన తీరు చూస్తుంటే.. ఆశ్చర్యమేస్తుంది. వివరాల్లోకి వెళితే..
అది కర్ణాటలోని ఓగ్రామం..ధార్వాడ జిల్లా ధార్వాడ తాలూకా సోమాపూర్ (అల్లాపూర్).. ఈ వూరికి 2008లో మొట్టమొదటి సారి అక్కడి ప్రభుత్వం ఆర్టీసీ బస్సును ప్రారం భించింది..అప్పటినుంచి అదే బస్సు ఆ గ్రామానికి సేవలందిస్తోంది.దాదాపు15 యేళ్ల పాటు ఆ గ్రామస్తుల కుటుంబాల్లో ఒకటిగా మారిపోయింది.రోజు సాయంత్రం రావడం..అక్కడే నైట్ హాల్ట్ చేయడం..తిరిగి ఉదయాన్నే వెళ్లిపోవడం..ఇలా 15యేళ్లు గడిచిపోయాయి..
గ్రామస్తుల నిత్యావసర రవాణా సేవలందించింది ఆ బస్సు. దీంతో బస్సుతో సన్నిహిత బంధాన్ని పెంచుకున్నారు గ్రామస్తులు. దానికి గుర్తుంగా KSRTC లోగోతోపాటు వారి గుర్తు నెమలి లోగోనే కూడా జోడించారు. ఈ బస్సును ముద్దుగా కిరా బస్సు అని పిలుచుకుంటున్నారు.
ఈ కిరా బస్సు.. 15 సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తులకు సేవలందిస్తోంది..సుమారు 11.80 లక్షల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. అల్లాపూర్ గ్రామస్తులు తన దైనందిన జీవితంలో కీలకమైన కిరా బస్సుతో గాఢమైన అనుబంధాన్నిఏర్పరుచుకున్నారు. ఈ బస్సులో ప్రయాణించిన స్కూల్, కాలేజీ విద్యార్థులు మంచి ప్రయోజకులై ప్రతిష్టాత్మకమైన పదవులు పొందారు. ఆ విధంగా గ్రామస్తులకు, బస్సుకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
అయితే ఇటీవల కాలంలో కిరా బస్సు సేవలను చాలించింది కర్ణాటక టీఎస్ ఆర్టీసీ.దీంతో గ్రామస్తులు కిరా బస్సుకు ఘనంగా వీడ్కోలు పలికారు..తోరణాలతో అలంకరించారు.పూజలు చేశారు. ఏడుస్తూ సొంత బిడ్డకు పెళ్లి చేసి పంపుతున్నట్లు వీడ్కోలు పలికాలు. డ్రైవర్, కండక్టర్లకు సత్కారంచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ వీడియో చూసి గ్రామస్తుల సెంటిమెంట్ కు ఫిదా అయిపోయారు.