మమ్ముట్టి నిర్మాణంలో... జ్యోతిక ఫిమేల్‌‌ లీడ్‌‌ రోల్

మమ్ముట్టి నిర్మాణంలో... జ్యోతిక ఫిమేల్‌‌ లీడ్‌‌ రోల్

డెబ్భయ్యేళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ, విజయాలు అందుకుంటూ సూపర్‌‌‌‌ స్టార్ ఇమేజ్‌‌ని నిలబెట్టుకుంటున్నారు మమ్ముట్టి. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. తెలుగులో అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్‌‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మరో రెండు సినిమాల్ని లైన్‌‌లో పెట్టారు. వాటిలో ఒకటి ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ మూవీ తీసిన జో బేబీ డైరెక్షన్‌‌లో. ఈ చిత్రాన్ని మమ్ముట్టియే నిర్మించనున్నారు. జ్యోతిక ఫిమేల్‌‌ లీడ్‌‌గా కనిపించనుంది.

ఆమెకి ఇదే మొదటి మలయాళ చిత్రం. ఇక ‘పుళు’ చిత్రాన్ని తీసిన రతీనా డైరెక్షన్‌‌లో మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మమ్ముట్టి. క్యాస్ట్‌‌ డిస్క్రిమినేషన్‌‌పై తెరకెక్కిన ‘పుళు’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా నెగిటివ్ రోల్‌‌లో మమ్ముట్టి నటనకు అందరూ హ్యాట్సాఫ్ చెప్పారు. అందుకే ఆయన రతీనా డైరెక్షన్‌‌లో మరోసారి యాక్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఈసారి కూడా ఒక ఎక్స్‌‌పెరిమెంటల్ మూవీనే ప్లాన్ చేసిందట రతీనా. మొత్తానికి ప్రయోగాలు చేయడమే కాదు, వాటితో విజయాలు కూడా అందుకుంటూ సత్తా చాటుతున్నారు మమ్ముట్టి.