సుచిత్రలో గ్యాస్ పైప్​లైన్ లీకేజ్

సుచిత్రలో గ్యాస్ పైప్​లైన్ లీకేజ్
  •      భారీగా ఎగిసిపడిన మంటలు
  •      ఇద్దరికి గాయాలు

జీడిమెట్ల, వెలుగు :  అండర్ గ్రౌండ్​లో ఉన్న గ్యాస్ పైప్​లైన్​కు లీకేజీ ఏర్పడటంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన జీడిమెట్ల డివిజన్ సుచిత్ర చౌరస్తా సమీపంలోని నేషనల్ హైవేపై సోమవారం జరిగింది. కొంత కాలంగా సుచిత్ర చౌరస్తాలో హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అండర్ గ్రౌండ్​లో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైప్​లైన్​కు లీకేజీ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

స్థానికులు వెంటనే జీడిమెట్ల ఫైర్​స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేశారు. వాళ్లు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో రాజు (27), సాయినాథ్ (48) గాయపడ్డారు. వాళ్లను ట్రీట్​మెంట్ కోసం ఓ హాస్పిటల్​కు తరలించారు. అయితే, పైప్​లైన్ లీకేజీకి కారణాలు తెలియరాలేదు. రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నప్పుడే పైప్​లైన్​కు ప్రొక్లెనర్ తగలడంతో గ్యాస్ లీకైందని స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో మంటలు చెలరేగి ఉంటాయని అంటున్నారు. గ్యాస్ లీక్ టైమ్​లో అటుగా వెళ్తున్న కొందరు సిగరెట్ తాగి పడేయడంతోనే మంటలు వ్యాపించాయని మరికొందరు చెబుతున్నారు.