
న్యూఢిల్లీ: మనదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 2013–-14, 2022–-23 మధ్య మొత్తం 4,62,733 మోసాలు జరిగినట్లు వెల్లడయింది. వీటి విలువ రూ.5.3 లక్షల కోట్లు ఉంటుందని తేలింది. సమాచార హక్కు (ఆర్‌టీఐ) పిటిషన్‌కు ప్రతిస్పందనగా రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాలను తెలియజేసింది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారీగా గత 10 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన బ్యాంకు మోసాల వివరాలనూ అందజేసింది.
మహారాష్ట్రలో అత్యధిక మోసాలు నమోదయ్యాయని, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది. గత 10 ఆర్థిక సంవత్సరాల్లో 8,000 నుంచి 12,000 వరకు మోసాలతో కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, కేర్‌రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, బ్యాంకులు మోసాలు పెరిగాయని, అయితే బ్యాంకులు క్రెడిట్ రిస్క్‌పై దృష్టి సారించాయని అన్నారు.