లైంగిక వేధింపుల కేసులో టీవీ నటుడి అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో టీవీ నటుడి అరెస్ట్
  • ప్రాచీన్ చౌహాన్ పై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక

ముంబయి: రెండు దశాబ్దాలుగా హిందీ బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందిన ప్రాచీన్ చౌహాన్ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. కసౌటి జిందగీ కే.. హతీమ్, మాట్ పితాకే చార్నర్ మెయిన్ స్వర్గ్ .. వంటి సీరియళ్లతో గుర్తింపు పొందిన ప్రాచీన్ చౌహాన్ తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ ఇంట్లో పని మనిషి ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని మాల్డ్ ఈస్ట్ పోలీసు స్టేషన్ లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం బాలీవుడ్ లో కలకలం రేపింది. తండ్రి వయసు కంటే పెద్ద వయసున్న ప్రాచీన్ చౌహాన్ మైనర్ బాలికను చెరపట్టాడనే విషయం చర్చనీయాంశం అయింది. అంతకు ముందే నాగిని-3 ఫేమ్ పరల్ వి పూరీ పై కూడా లైంగిక ఆరోపణలు వచ్చిన కొన్ని రోజులకే ప్రాచీన్ చౌహాన్ పై కూడా దాదాపు అవే ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది.
కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు కోసం వస్తారని తెలిసి ప్రాచీన్ చౌహాన్ ముందస్తు బెయిల్ కోసం బోరివాలి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అరెస్టు గురించి పోలీసులు ధృవీకరించేలోపే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు జరిగిపోయినట్లు సమాచారం.