టాయిలెట్ క్లీనింగ్ యాడ్‌ విషయంలో.. నేనెప్పుడూ బాధ పడలేదు.. హీరో అబ్బాస్

టాయిలెట్ క్లీనింగ్ యాడ్‌ విషయంలో.. నేనెప్పుడూ బాధ పడలేదు.. హీరో అబ్బాస్

టాలీవుడ్ హీరో అబ్బాస్( Abbas) తన యాక్టింగ్ తో  కుర్రాళ్లకే కాదు లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ప్రేమదేశం, నీ ప్రేమకై వంటి మూవీస్ తో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అబ్బాస్..ఇండస్ట్రీ కు దూరంగా ఉంటున్నారు. లేటెస్ట్ గా అబ్బాస్ ఒక తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు బయటపెట్టారు. 

గతంలో అబ్బాస్ టాయిలెట్ క్లీనర్ కి సంబంధించిన ఒక ప్రాడెక్ట్‌ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఆ యాడ్‌ చేసిన కారణంగా అబ్బాస్ ను చాలా మంది విమర్శించడంతో పాటు ఆ వీడియోను రకరకాలుగా ట్రోల్‌ చేయడం జరిగింది. ఆ ట్రోల్స్ తనకు బాధ కలిగించలేదని..తనను విమర్శించిన వారి గురించి ఎక్కువ ఆలోచించలేదని అన్నారు. తాను ఇంటి పరిశుభ్రం గురించిన ప్రొడక్ట్‌ ప్రమోషన్ లో నటించాను. అంతే తప్ప తాను ఏ తప్పు చేయలేదు. అందుకే తాను విమర్శలు వచ్చినప్పుడు బాధపడలేదు. 

టాయిలెట్ క్లీనింగ్ హార్పిక్  యాడ్‌ విషయంలో..ఎందుకు చేశానో అని తాను ఎప్పుడు కూడా బాధ పడలేదు. ఇండస్ట్రీలో తనకు మంచి గుర్తింపు ఉన్న సమయంలో తనకు మంచి పారితోషికం ఇచ్చిన కారణంగా ఆ ప్రాడెక్ట్‌ కి ప్రమోషన్ చేసేందుకు ముందుకు వచ్చాను. తనకు ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ కొందరు మాత్రం ఏదో జరిగినట్లుగా తెగ విమర్శలు చేశారు అంటూ అబ్బాస్ పేర్కొన్నారు. కొంతకాలం పాటు ఫ్యామిలీతో  న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ సెటిల్ అయినా అబ్బాస్, ఇక  రీసెంట్ గా చెన్నై కి తెరిగి వచ్చారు.  దీంతో అబ్బాస్ మళ్ళీ తెలుగు మీడియా ముందుకు రావడంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అబ్బాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

టాలీవుడ్ లోని ఫేమస్ ఆర్టిసులందరు సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేస్తూ.. సక్సెస్ అవుతుండటం తెలిసేందే. కాగా అబ్బాస్ కు ఒక స్పెషల్ రోల్ పడితే..మళ్ళీ బిజీ అవ్వడం కన్ఫర్మ్ అంటున్నారు సినీ క్రిటిక్స్.