హైదరాబాద్ : ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో చేపట్టిన విద్యార్థుల మహాధర్నాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రధానమైన తొమ్మిది సమస్యలను రాష్ర్ట ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
విద్యార్థుల డిమాండ్లు ఇవే..
* ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ చదివే బీసీ విద్యార్థుల ఫీజుల స్కిమ్ ను పునరుద్ధరించాలి.
* ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
* పెరిగిన ధరల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలి
* అదనంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలి
* గురుకులాలలోదరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా విద్యను అందించాలి
* దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి విదేశీ విద్యానిధులు మంజూరు చేయాలి
* అద్దె భవనాల్లో కొనసాగుతున్న కాలేజీ హాస్టళ్లకు స్వంత భవనాలు నిర్మాంచాలి
* పాత కలెక్టర్ భవనాలను కాలేజీ హాస్టళ్లకు కేటాయించాలి
* జూనియర్ అడ్వకేట్లకు ఇచ్చే స్టై ఫండ్ నెలకు వెయ్యి నుంచి రూ.10 వేలకు పెంచాలె

