ఆన్సర్‌‌‌‌ షీట్ల వ్యవహారంలో ముగ్గురిపై వేటు

ఆన్సర్‌‌‌‌ షీట్ల వ్యవహారంలో ముగ్గురిపై వేటు
  •  విధుల నుంచి తప్పించి షోకాజ్‌‌‌‌  నోటీసులు
  • స్టూడెంట్లకు ఎలాంటి నష్టం ఉండదన్న డీఈవో

పాల్వంచ, వెలుగు : టెన్త్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌లో మెయిన్‌‌‌‌ ఆన్సర్‌‌‌‌ షీట్‌‌‌‌కు బదులు అడిషనల్‌‌‌‌ షీట్లు ఇచ్చిన వ్యవహారంలో ముగ్గురిపై వేటు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌‌‌‌ ఉన్నత పాఠశాల టెన్త్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌ సెంటర్‌‌‌‌లో సోమవారం స్టూడెంట్లకు మెయిన్‌‌‌‌ ఆన్సర్‌‌‌‌ షీట్‌‌‌‌కు బదులుగా అడిషనల్‌‌‌‌ షీట్లు ఇచ్చారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేపట్టిన ఆఫీసర్లు చీఫ్‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌ బీపీఆర్‌‌‌‌ఎల్‌‌‌‌. కుమారి, డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ బావ్‌‌‌‌సింగ్‌‌‌‌, ఇన్విజిలేటర్‌‌‌‌ డి.సరోజినీని విధుల నుంచి తప్పించి, షోకాజ్‌‌‌‌ నోటీసులు జారీ చేసినట్లు డీఈవో వెంకటేశ్వరరాచారి చెప్పారు. 

బుధవారం డీఈవో మాట్లాడుతూ జరిగిన పొరపాటుపై ఇప్పటికే ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ బోర్డుకు లెటర్‌‌‌‌ రాశామని రాశామని చెప్పారు. అడిషనల్‌‌‌‌ షీట్లలో ఎగ్జామ్‌‌‌‌ రాసిన స్టూడెంట్లకు నష్టం ఉండదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.