గ్రూప్ 2 వాయిదా కోసం చలో టీఎస్పీఎస్సీ

గ్రూప్ 2 వాయిదా కోసం చలో  టీఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో గ్రూపు 2 పరీక్షను వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగులకు ఇబ్బందిగా మారాయి. వరుసగా పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల సమయం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు అభ్యర్థులు. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేక ఒత్తిడికి గురవుతున్నామంటున్నారు. వరుసగా పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న చలో టీఎస్పీఎస్సీకి పిలుపునిచ్చారు. 

ఆగస్టు 2 నుంచి 21 వరకు గురుకుల పరీక్షలు ఉన్నాయి. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జేఎల్ పరీక్షలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ అధికారులు ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో చాలా పరీక్షలు ఉన్నాయంటున్నారు అభ్యర్థులు. గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలతో ఇబ్బంది ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. ఎకానమి పేపర్ లో అదనంగా 70శాతం సిలబస్ ఉందన్నారు. గ్రూపు 2 పరీక్షలప్పుడే రాఖీ పండగ వచ్చిందని చెప్పారు. ఆగస్టు 31న రాఖీ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. గ్రూపు 2 పరీక్షలు వాయిదా ఉండదని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు.. గ్రూప్ 2  పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.