వరల్డ్ లోనే ఫస్ట్ టైం.. బిడ్డ మృతదేహాన్ని తిన్న తల్లి కోతి

వరల్డ్ లోనే ఫస్ట్ టైం.. బిడ్డ మృతదేహాన్ని తిన్న తల్లి కోతి

యూరప్ లోని చెక్ రిపబ్లిక్‌లోని జంతుప్రదర్శనశాలలో ఒక కోతి తన శిశువు మృతదేహాన్ని తీసుకెళ్లి తినేసింది. ఈ వింత సంఘటన ద్వూర్ క్రాలోవ్ సఫారీ పార్క్ లో చోటుచేసుకుందని లైవ్ సైన్స్ ఒక నివేదికలో పేర్కొంది. మాండ్రిల్లస్ ల్యూకోఫేయస్‌ జాతికి చెందిన కుమాసి అనే ఆడ కోతి 2020 ఆగస్టులో జన్మనిచ్చింది. ఎనిమిది రోజుల తర్వాత శిశువు చనిపోయిందని లైవ్ సైన్స్ నివేదిక తెలిపింది. అయితే తల్లి కోతి చేసే ఈ అసాధారణ చర్యలు భవిష్యత్తులో మరొక బిడ్డను కలిగి ఉండే అవకాశాలను మెరుగుపరుస్తాయని చాలా మంది నమ్ముతారు.

ALSO READ:తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై ఫోకస్... అధికారులతో ఈవో ధర్మారెడ్డి సమీక్ష 

శిశువు చనిపోవడానికి సరైన కారణం నివేదించనప్పటికీ.. అది పుట్టుకతోనే ఆరోగ్యం బాగా లేనట్టు తెలుస్తోంది. కోతి పిల్ల చనిపోవడంతో, కుమాసి తన బిడ్డ శవాన్ని దాదాపు రెండు రోజుల పాటు మోసుకెళ్తూ కనిపించింది. రెండవ రోజు ముగిసే సమయానికి, కుమాసి తన చనిపోయిన బిడ్డను తినడం ప్రారంభించడం అక్కడున్న వారిని షాక్ కు గురి చేశాయి.

డ్రిల్ ట్రూప్‌ను అధ్యయనం చేస్తున్న పరిశోధకులు ఈ మొత్తం సంఘటనను డాక్యుమెంట్ చేశారు. డ్రిల్ ట్రూప్‌ను అధ్యయనం చేస్తున్న పరిశోధకుల బృందం జూన్ 27న ప్రైమేట్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ సంఘటన గురించి వివరించింది. కుమాసి తన బిడ్డను తింటున్న వీడియోలను కూడా వారు పంచుకున్నారు. కుమాసి.. శిశు నరమాంస భక్ష్యం చేయడం ఇలా ఇంతకుముందు ఎన్నిసార్లు చేసిందో స్పష్టంగా తెలియదు, కానీ ఇది చాలా అరుదు. "శాస్త్రీయ సాహిత్యంలో, నివేదికల్లో మాత్రమే ఇలాంటి సంఘటనలు ఉంటాయి" అని అధ్యయనం చేసిన నిపుణుల్లో ఒకరు చెప్పారు.

శిశువు మరణించిన తరువాత, కుమాసి తన శిశువును తన దగ్గరే ఉంచుకుంది. తన వద్దకు వచ్చిన బృందంలోని ఇతర సభ్యులను కూడా దగ్గరికి రానివ్వలేదు. తల్లి కోతి తన బిడ్డ కోసం దుఃఖిస్తూ ఉంటుందేమోనని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే తల్లి కోతి.. తన బిడ్డ చనిపోయిందని అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చని కూడా పరిశోధకులు అనుమానిస్తున్నారు. కోతి పునరుత్పత్తిని మెరుగుపరచడం కోసం నరమాంస భక్షణ చేసిందని నిపుణులు అంటున్నారు.