కరోనా పేషెంట్ తో డాక్టర్ అసభ్య ప్రవర్తన

కరోనా పేషెంట్ తో డాక్టర్ అసభ్య ప్రవర్తన

ముంబై సెంట్రల్ లో ఘటన
ముంబై: కరోనా పాజిటివ్ పేషెంట్ తో ఒక డాక్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ముంబైలో జరిగింది. ముంబై సెంట్రల్ లోని ఒక ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో ఉన్న కరోనా మగ పేషెంట్ పై ఓ డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును అసభ్యకర రీతిలో టచ్ చేయడం (ఇనప్రాప్రియేట్ టచింగ్)గా పోలీసు అధికారులు చెప్పారు.

ఆస్పత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు డాక్టర్ పై కేసు నమోదు చేశారు. కరోనా పాజిటివ్ పేషెంట్ తో కాంటాక్ట్ అయిన నిందితుడిని అరెస్ట్‌ చేయలేదని.. అతడ్ని క్వారంటైన్ లో ఉంచామని పోలీసులు పేర్కొన్నారు. క్వారంటైన్ పీరియడ్ ముగిశాక అతడ్ని అరెస్ట్ చేస్తామన్నారు. నిందితుడు ఎండీ ఈ ఘటన చోటు చేసుకోవడానికి ఒక రోజు ముందు సదరు ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.