పాతబస్తీలో ఉద్రిక్తత..ఫ్లై ఓవర్ ప్రారంభం రద్దు

పాతబస్తీలో ఉద్రిక్తత..ఫ్లై ఓవర్ ప్రారంభం రద్దు

చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం రద్దయింది. ఈ రోజు మంత్రి కేటీఆర్ ప్లై ఓవర్ ను ప్రారంభించాల్సి ఉండగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. పనులు పూర్తయినప్పటికీ కేటీఆర్ రాకపోవడం వల్లే చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ఓపెనింగ్ రద్దయినట్టు సమాచారం. తిరిగి ఈ నెల 27న ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పాత బస్తీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం... నేడు చాంద్రాయణగుట్ట పై వంతెనను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ పలు కారణాల రిత్యా కేటీఆర్ కార్యక్రమానికి హాజరు కావడం లేదని.. ఈ నెల 27న ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవ‌ర్‌ను . శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు ఎంతో సమయం కలిసిరానుంది. అదేవిధంగా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలకు కూడా ఇక చెక్ పడినట్లేనని చెప్పొచ్చు. చాంద్రాయణగుట్ల ఫ్లై ఓవర్ రెండు వైపులా నిర్మాణం చేపట్టడంతో ప్రయాణం సులభం కావడంతో పాటు.. ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లేందుకు సకాలంలో చేరడానికి వీలుకానున్నట్టు తెలుస్తోంది. కందికల్ గేట్, బర్కాన్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్లొచ్చు.