
- 9 మంది అరెస్ట్
మెదక్/నిజాంపేట, వెలుగు: మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ మహిళను కొట్టి, చంపాలని చూసిన తొమ్మిది మందిని నిజాంపేట పోలీసులు అరెస్ట్చేశారు. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన ఇంబడి సత్తవ్వ మంత్రాలు చేస్తుందనే అనుమానంతో అదే గ్రామానికి చెందిన తొమ్మిది మంది ఈ నెల 10న ఆమెపై దాడి చేశారు.
అనంతరం డీజిల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేయగా బాధితురాలు తప్పించుకుని ఈ నెల13న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.