వికారాబాద్ జిల్లాలో .. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు, షాపులో మంటలు

 వికారాబాద్ జిల్లాలో .. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు, షాపులో మంటలు
  • కాలిపోయిన బంగారం, వెండి, నగదు, వస్తువులు
  • వికారాబాద్ జిల్లాలో ఘటన

పరిగి వెలుగు : షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు, షాపు కాలిపోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. 6 తులాల బంగారం, రూ. లక్ష నగదు, 500 గ్రాముల వెండి, వస్తువులు కాలిపోయాయి. బాధితులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. పరిగి మండలం యాబాజిగూడలో శుక్రవారం తెల్లవారుజామున కొమ్మ నారాయణ కిరాణ షాపులో గురువారం షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫ్రిజ్ వద్ద మొదలైన మంటలు షాపుతో పాటు ఇంట్లోకి వ్యాపించగా వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

నారాయణ తన కుటుంబసభ్యులతో నిద్రిస్తుండగా.. మంటలు చెలరేగడం చూసి బయటకు వెళ్లగా ప్రమాదం తప్పింది. స్థానికల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చేలోపు అంతా కాలిపోయింది. దాదాపు 15-.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇంటి బయట గడియ పెట్టి ఉందని నారాయణ భార్య శశికళ ఆరోపించారు. బాధితులను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు.