
జీడిమెట్ల, వెలుగు : ఓ యువతిపై తండ్రి, లవర్ ఫ్రెండ్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీసులు తెలిపిన ప్రకారం.. కుత్బుల్లాపూర్ కు చెందిన యువతి కుటుంబ సమస్యల కారణంగా స్కూల్ చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. కొంతకాలం కిందట ఆమెపై తండ్రి పలుమార్లు లైంగికదాడికి పాల్పడగా.. తల్లికి తెలిసినా పరువు పోతుందని, ఎవరికీ చెప్పొద్దని యువతికి సర్దిజెప్పింది.
ఇటీవల యువతికి సంతోశ్అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తరచూ చాటింగ్ చేసుకుంటూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. గత డిసెంబర్ 26న సంతోశ్కలుద్దామంటూ ఆమెను సికింద్రాబాద్ కు రమ్మనగా వెళ్లింది. అతడు తన ఇంటికి తీసుకెళ్లి ఒకరోజు ఉంచుకుని తిరిగి ఆమెను ఇంటికి వెళ్లమని చెప్పగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చింది. అక్కడ సంతోశ్ఫ్రెండ్ రవికి ఫోన్ చేసి తాను ఇంటికి వెళ్లనని జాబ్ చూపిస్తే చేసుకుంటానని చెప్పింది.
దీంతో రవి ఆమెను పటాన్ చెరులోని తన రూమ్ కు తీసుకెళ్లాడు. అదే నెల 29న రవి మద్యం తాగొచ్చి యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం యువతిని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వదిలేశాడు. ఆమె తన చెల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. కుటుంబసభ్యులు వచ్చి ఇంటి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె కనిపించడంలేదని కుటుంబసభ్యులు జీడిమెట్ల పోలీసుస్టేషన్ లో కంప్లయింట్ చేశారు. యువతిని విచారించగా అసలు జరిగినదంతా చెప్పింది. నిందితులపై కేసు నమోదు చేసి జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.