V6 News

భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టాలి

భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టాలి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భగవద్గీతను పాఠ్యాంశంగా పెట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని హైదరాబాద్ ఇస్కాన్ ప్రతినిధి కీర్తి రాజ దాస్ ప్రమోజీ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన హిందూ మహాసమ్మేళనం సభలో ఆయన మాట్లాడారు. వేద భూమి, తపో భూమి అయిన భారత దేశంలోని సంస్కృతి చాలా గొప్పదన్నారు. తల్లిలాంటి గోవులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రచారక్ లింగం శ్రీధర్, అరుణాచల స్వామి, పెద్దాడ ఆశాలత, రామడుగు నర్సింహ శాస్త్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన సంస్కృతి సాంప్రదాయాలను మనవాళ్లు మర్చిపోతుండడం బాధాకరమన్నారు. కుల మతాలకతీతంగా భారతీయులుగా ఎదుగుదామన్నారు. హిందూ జాతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.