హైదరాబాద్ సిటీ, వెలుగు: తుక్కుగూడ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్ జోన్లో కలపాలని తుక్కుగూడకు చెందిన అన్ని పార్టీల నేతలు బుధవారం బల్దియా హెడ్ ఆఫీసులో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఎల్బీ నగర్ తుక్కుగూడకు దగ్గరగా ఉంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
తుక్కుగూడ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిందని, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న తమ మున్సిపాలిటీని చార్మినార్ జోన్ లో కలిపితే డెవలప్మెంట్ ఆగిపోతుందని వివరించారు. చార్మినార్ జోన్ లో కలిపితే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
