
- రూ.15 లక్షల పైన ఆదాయం ఉన్నవారికి ఉపశమనం
న్యూఢిల్లీ : దేశంలో వినియోగం పెంచేందుకు ప్రభుత్వం ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్లను తగ్గించే ఆలోచనలో ఉందని రాయిటర్స్ పేర్కొంది. పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్‌లోని కొన్ని స్లాబ్‌ల రేట్లను తగ్గించొచ్చని తెలిపింది. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చే నెల ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో ట్యాక్స్ రేట్ల తగ్గింపు ఉండొచ్చని అంచనా వేసింది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ఏడాదికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారికి రానున్న బడ్జెట్‌లో ఉపశమనం దొరకొచ్చు.
కొత్త ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం, రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారిపై 5 శాతం నుంచి 20 శాతం ట్యాక్స్ పడుతుండగా, రూ.15 లక్షల పైనున్న వారిపై 30 శాతం పడుతోంది. కాగా, ఇండియా జీడీపీ 2023–24 లో 8.2 శాతం వృద్ధి చెందినా, వినియోగం మాత్రం ఇందులో సగం గ్రోత్ రేటునే నమోదు చేసింది. అంతేకాకుండా ప్రజలు ఇన్‌ఫ్లేషన్, నిరుద్యోగం, ఆదాయాలు తగ్గడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనే విషయం పోస్ట్ పోల్ సర్వేలో తేలింది.
ప్రధాని మోదీ కూడా తమ మూడో టెర్మ్‌లో మిడిల్ క్లాస్‌పై ఎక్కువ ఫోకస్ పెడతామని ప్రకటించారు. వీరి సేవింగ్స్ పెంచుతామని, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.