ముంచుకొస్తున్న సౌర తుఫాన్.. మన ఫోన్లు పని చేయవా..!

ముంచుకొస్తున్న సౌర తుఫాన్.. మన ఫోన్లు పని చేయవా..!

అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ ఈ నెల 24న భూమిని తాకింది. సూర్యుడి నుంచి ఏర్పడే శక్తివంతమైన పేలుళ్ల కారణంగా ఈ సౌర జ్వాలలు అంతరిక్షంలోకి వెదజల్లబడుతాయి. గత 6 ఏళ్లలో భూమిని తాకిన అతిపెద్ద భూ అయస్కాంత తుఫానుగా శాస్త్రవేత్తలు దీనిని పేర్కొన్నారు. ఈ సౌర తుఫాన్ ఆదివారం భూ వాతావరణాన్ని ఢీకొట్టింది. ఇది భూమి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలో రేడియో ప్రసారాలు, విద్యుత్ గ్రిడ్లు ప్రభావితం అవుతాయి. ధృవాల వద్ద కాంతివంతమైన అరోరాలను ఏర్పరుస్తాయి.భూ అయస్కాంత క్షేత్రానికి భంగం కలిగించింది. NOAA యొక్క స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది.

కరోనల్ మాస్ ఎజెక్షన్ గా పిలువబడే ఈ సౌరజ్వాలలు అత్యంత ఆవేశిత కణాలను కలిగి ఉంటాయి. సౌర జ్వాలలు ఎగిసి పడి ఇలా భూమి వైపు వస్తుంటాయి. అయితే, భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ సౌర జ్వాలలను అడ్డుకుని, భూమిపై ఉండే జీవజాలాన్ని రక్షిస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో అంతరిక్షంలోని శాటిలైట్లపై ప్రభావం చూపిస్తుంది. సౌర జ్వాల భూమిని ఢీకొట్టే సమయంలో శాటిలైట్లను సేఫ్ మోడ్‌లో ఉంచడం ద్వారా శాస్త్రవేత్తలు వీటిని రక్షిస్తుంటారు.