నార్మల్ డెలివరీలు పెంచాలె : కలెక్టర్ యాస్మిన్ భాష

నార్మల్ డెలివరీలు పెంచాలె : కలెక్టర్ యాస్మిన్ భాష

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష డాక్టర్లకు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం (MCH) ను  ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ యాస్మిన్ భాష.. ప్రధాన ఆసుపత్రి, MCH వార్డులలో పేషెంట్లకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి (MCH) లో తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్..  బాలింతలతో మాట్లాడి వైద్య సేవలను గురించి తెలుసుకున్నారు.  పేషంట్స్ కు పెట్టే ఫుడ్ క్వాలిటీని కలెక్టర్ పరిశీలించారు. 

అనంతరం ఆస్పత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, ఆస్పత్రికి వచ్చే రోగి వెంట ఒకరు లేదా ఇద్దరు మాత్రమే అటెండెంట్ ఉండాలని ఎక్కువమంది ఉంటే బాలింతలు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుందని అధికారులకు చెప్పారు. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.  ప్రభుత్వాసుపత్రిలో అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించిన కలెక్టర్ యాస్మిన... లీవ్ లో ఉన్న డాక్టర్ల వివరాలతో పాటు, అందుకు గల కారణాలను కూడా తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.