రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల సంఖ్య పెంచండి: ఎంపీ కృష్ణయ్య

రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల సంఖ్య పెంచండి: ఎంపీ కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్​చేశారు. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని హాస్టళ్లు లేకపోవడంతో చాలా మంది యువత మధ్యలోనే చదువును ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే హాస్టళ్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. 

నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్‎గా ముత్తోజు శ్రీనివాస్ చారిని నియమిస్తూ ఆర్. కృష్ణయ్య శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్ లోని బీసీ భవన్​లో  నియామక పత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్​మెంట్, మెస్ బిల్లులు, హాస్టల్ భవనాల అద్దె బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని కోరారు.