లాక్ డౌన్ ఎఫెక్ట్.. మార్కెట్ ను షేక్ చేస్తున్న ఆన్ లైన్ గేమింగ్

లాక్ డౌన్ ఎఫెక్ట్.. మార్కెట్ ను షేక్ చేస్తున్న ఆన్ లైన్ గేమింగ్

వెలుగు, బిజినెస్‌‌డెస్క్:  కరోనా వైరస్.. గేమింగ్ ఇండస్ట్రీని క్వారంటైన్ కింగ్‌‌ను చేసింది. కరోనా లాక్‌‌డౌన్‌‌ కాలంలో పిల్లలు, పెద్దలు, కాలేజీ స్టూడెంట్స్, ఉద్యోగులు అనే తేడా లేకుండా అందర్ని తన వైపుకి తిప్పుకుంది ఆన్‌‌లైన్ గేమింగ్ ఇండస్ట్రీ. పిల్లలకు ఫోన్ కనిపిస్తే చాలు, గేమ్స్‌‌ ఆడటానికే అతుకుపోతున్నారు. దీనికి తోడు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని ఎక్స్‌‌పర్ట్‌‌లు, ప్రభుత్వాలు హెచ్చరిస్తుండటంతో.. చాలా మంది పేరెంట్స్ కూడా పిల్లలను అసలు బయటికి పంపడం లేదు. యువత కూడా పబ్‌‌జీ, లూడో కింగ్ లాంటి గేమ్‌‌లకు అతుక్కుపోయారు. దీంతో ఆన్‌‌లైన్ గేమింగ్ మార్కెట్ కూడా ఉవ్వెత్తున ఎగిసింది. కేవలం మూడు నెలల్లోనే ఆన్‌‌లైన్ గేమింగ్ మార్కెట్‌‌కు బాగా ఊపు వచ్చింది. 2020లో గ్లోబల్ వీడియో గేమ్ మార్కెట్ 159 బిలియన్‌‌ డాలర్లకు చేరుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. మ్యూజిక్ ఇండస్ట్రీకి 2019లో వచ్చిన 57 బిలియన్ డాలర్ల రెవెన్యూల కంటే ఇది మూడింతలు ఎక్కువ. ఆన్‌‌లైన్ గేమ్స్‌‌ కు అతిపెద్ద మార్కెట్‌‌గా ఆసియా–పసిఫిక్ రీజియన్‌‌ మారింది.

లూడో కింగ్ రికార్డు బద్దలు కొట్టింది…

పోకర్, బింగ్, షూటింగ్ లాంటి గేమ్స్‌‌ ను ఎక్కువగా ఆడేస్తున్నారు. సింపుల్ గేమ్స్ లూడో, క్యాండీ క్రష్‌‌లు అయితే రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒకరకంగా చెప్పుకోవాలంటే లూడో గేమ్ క్వారంటైన్‌‌ కింగ్‌‌గానే నిలిచింది.ఆండ్రాయిడ్, ఐఓఎస్‌‌లో  ఇండియాస్ నెంబర్ వన్ గేమింగ్ యాప్‌‌గా లూడ్ కింగ్ రికార్డు సృష్టించింది. లూడో కింగ్‌‌ను ముంబైకి చెందిన గేమేషన్ టెక్నాలజీస్ ఫౌండర్ వికాస్ క్రియేట్ చేశారు. కరోనా లాక్‌‌డౌన్‌‌లో ఇది మేజర్ సెన్సేషన్‌‌గా నిలిచింది. ఇండియాలో లాక్‌‌డౌన్‌‌కు ముందు లూడో కింగ్‌‌కు డైలీ యాక్టివ్ యూజర్లు 1.5 కోట్ల మంది ఉంటే, ఇప్పుడు ఒక్కసారిగా ఈ మార్క్ 5 కోట్లకు చేరుకుంది. మంత్లీ యాక్టివ్  యూజర్లు 18.5 కోట్లు మంది ఉన్నారు. పాత కాలంలో ఆడుకునే వైకుంఠపాళికి, లూడో కింగ్ మోడ్రన్ టచ్‌‌ను యాడ్ చేయడమే ఈ గేమ్‌‌ సక్సెస్‌‌కు కారణం. క్యాండీ క్రష్ , పబ్‌‌జీ, టెంపుల్‌‌రన్ ఇలా అన్ని గేమ్స్‌‌ ను ఇది దాటేసింది. ఆసియాలో అతిపెద్ద గేమింగ్ కంపెనీలు నింటెండో, టెన్సెంట్ లాంటి వాటికి సేల్స్ విపరీతంగా పెరిగాయి. వీటి ప్రాఫిట్స్ 41 శాతం ఎగిశాయి. టెన్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఆన్‌‌లైన్ గేమ్స్ రెవెన్యూ 31 శాతం పెరిగింది. 50 మార్కెట్లలో సేల్స్ 63 శాతం వరకు పెరిగినట్టు గేమ్స్ ఇండస్ట్రీ డాట్ బిజ్ ఎనాలసిస్‌‌లో తెలిసింది. కరోనా విజృంభణ సమయంలో రిలీజ్ అయిన కొత్త గేమ్ లు కూడా బాగా సక్సెస్ సాధించాయి. కొత్త గేమ్ డౌన్‌‌లోడ్స్‌‌ 80 శాతం పెరిగినట్టు తెలిసింది.

చతికిల పడ్డ ఫాంటసీ గేమ్స్…

గేమింగ్ ఇండస్ట్రీ ఇంతలా పెరిగిన ఈ కాలంలో మాత్రం ఫాంటసీ గేమ్స్ మాత్రం చతికిలపడ్డాయి. ఐపీఎల్‌‌ లాంటి రియల్ గేమ్స్ రద్దు కావడంతో, ఫాంటసీ గేమ్స్ కు కూడా డిమాండ్ పోయింది. రియల్ ప్లేయర్స్​ను సెలెక్ట్ చేసుకుని వర్చువల్‌‌ టీమ్‌‌తో ఆన్‌‌లైన్‌‌గా ఫాంటసీ గేమ్స్ ఆడుతూ ఉంటారు. టోర్నమెంట్ సమయంలో ప్లేయర్ల యాక్చువల్ పర్‌‌‌‌ఫార్మెన్స్ ఆధారంగా పాయింట్లు వస్తాయి. ఎక్కువ పాయింట్లు పొందిన వారు విన్నర్ అవుతారు. గత రెండేళ్లలో మాత్రం ఫాంటసీ గేమ్స్ 100 శాతం గ్రోత్‌‌ను నమోదు చేశాయి. కానీ ఇప్పుడు పూర్తిగా జీరో గ్రోత్‌‌ను పొందాయి. ఈ ఫాంటసీ గేమ్స్‌‌ లో ఎక్కువగా స్టార్టప్‌‌లే ఉన్నాయి. ఇండియాలో 700 ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌‌ఫామ్స్‌‌ ను స్టార్టప్‌‌లే నడుపుతున్నాయి.

పిల్లలకు వ్యసనంగా మారితే ప్రమాదం….

కరోనా లాక్‌‌డౌన్‌‌తో పేరెంట్స్ పిల్లలను బయటికి పంపించడం లేదు. సోషల్ డిస్టెన్సింగ్ వల్ల పొరుగువారితోనూ్లా ఆడుకోనివ్వడం లేదు. దీంతో పిల్లలు ఎక్కువగా ఫోన్లలో యాక్షన్, షూటింగ్ గేమ్స్ ఆడుతున్నారు. ఖాళీ దొరికితే స్మార్ట్ ఫోన్లు తీసుకుని గేమ్స్ ఆడేస్తున్నారు. అయితే యాక్షన్, షూటింగ్ గేమ్స్ పిల్లల మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   గేమ్స్ పిల్లలకు వ్యసనంగా మారితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని అంటున్నారు. పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి మైండ్‌‌ను యాక్షన్ గేమ్స్ కే వ్యసనంగా మారకుండా చూసుకోవాలన్నారు.

తక్కువ వడ్డీకే హౌజింగ్ లోన్లు