చైనా నుంచి పెరిగిన దిగుమతులు

చైనా నుంచి పెరిగిన దిగుమతులు

బీజింగ్: 2022లో భారతదేశం– చైనా మధ్య వాణిజ్యం 135.98 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వాణిజ్య లోటు మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కును క్రాస్‌ చేసింది. 2022లో భారతదేశం–-చైనా వాణిజ్యం 8.4 శాతం పెరిగింది. భారతదేశానికి చైనా ఎగుమతులు 118.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వార్షికంగా 21.7 శాతం పెరిగాయి. 2022లో భారతదేశం నుంచి చైనా దిగుమతులు  17.48 బిలియన్ డాలర్లకు తగ్గాయి.

ఇవి సంవత్సరానికి 37.9 శాతం పడిపోయాయి.  వాణిజ్య లోటు 101.02 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2021 సంవత్సరంలో  69.38 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య లోటు 100 బిలియన్ డాలర్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి.  2021లో  చైనాతో  వాణిజ్యం మొత్తం  125.62 బిలియన్ డాలర్లకు చేరుకుంది.