నాలుగు గంటల నుంచి పది గంటలకు పెరిగిన ఇంటర్నెట్ వాడకం

నాలుగు గంటల నుంచి పది గంటలకు పెరిగిన ఇంటర్నెట్ వాడకం

లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి నగరంలో ఇంటర్ నెట్ వాడకం బాగా పెరిగింది. గతంలో రోజుకు 4 గంటలు నెట్ వాడే జనం.. ఇప్పుడు ఏకంగా 10 నుంచి 12 గంటలు వినియోగిస్తున్నారు. దాంతో మొబైట్ డేటా సరిపోవడం లేదని.. బఫరింగ్ సమస్యలు వస్తున్నాయంటున్నారు. మరోవైపు వర్క్ ఫ్రం హోమ్, ఆన్ లైన్ క్లాసులకు ఇబ్బంది కలగడంతో ప్రజలు వైఫై కనెక్షన్లపై ఇంట్రస్టు చూపిస్తున్నారు.

ఆన్ లైన్ షాపింగ్, మనీ ట్రాన్సాక్షన్స్,  బ్యాంకు లావాదేవీలు, ఫుడ్ ఆర్డరస్.. ఒకటేమిటి అన్నీ ఆన్ లైన్‌లోనే చేస్తున్నారు. లాక్ డౌన్‌తో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. స్కూల్స్ మూతపడటంతో విద్యార్థుల ఆన్ లైన్ క్లాసులు వింటున్నారు.  తమకు కావాల్సిన పుస్తకాలు, గ్రంథాలు, ఇంటర్నెట్‌లో లభిస్తుండటంతో జనాలు కూడా వాటిపై ఆసక్తి చూపుతున్నారు. దాంతో సిటీలో వైఫై కనెక్షన్‌లు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.

పెరిగిన ఆన్ లైన్  రద్దీని తట్టుకునేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్  ప్రొవైడర్లు ఇంటర్నెట్ సామర్థ్యం పెంపుదలపై దృష్టిపెట్టాయి. ఇంటర్ నెట్ సంస్థలు బెస్ట్ ప్లాన్స్ అందిస్తుండటంతో మనీ కూడా సేవ్ అవుతోందని యూజర్లు అంటున్నారు. దీంతో గతంతో పోల్చితే నగరంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌లు మూడింతలు పెరిగినట్లు సర్వేలు చేబుతున్నాయి.  వీడియో స్ట్రీమింగ్ వల్ల ఎక్కువ స్థాయిలో నెట్ వాడకం పెరిగిందని టెలికాం కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. వీడియో నాణ్యతను తగ్గించడం ద్వారా దాదాపు 20% డేటాను పొదుపు చేయొచ్చని వారు అంటున్నారు.  దీంతో అమెజాన్  ప్రైమ్, నెట్  ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సర్వీస్  ప్రొవైడర్లతో పాటు… యూట్యూబ్ కూడా వీడియోల క్వాలిటీని  తగ్గించాయి. కరోనాకు ముందు 60 శాతం నెట్ వినియోగించే ప్రజలు ప్రస్తుతం వందశాతం వాడుతున్నట్టు తెలుస్తోంది.

For More News..

వీడియో: మా వాడకట్టకు రోడ్డు వేయించండి.. ఎమ్మెల్యేను అడిగిన బాలుడు

ఒక్క కార్పొరేటర్‌ని కెలికెతే.. వందమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతం

500 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద గుడి