మార్కెట్లలో ఆకుకూరల ధరలు మండిపోతున్నాయి. కొత్తి మీర ధర కొండెక్కి కూర్చుంది. చిన్న కట్ట రూ.15 నుంచి 20 పలుకుతోంది. గతంలో రూ.3 నుంచి రూ.5లు ఉండేది. పుదీన కూడా రూ.20 పలుకుతోంది. తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలు రూ. 6 నుంచి 10 రూపాయలు. సరైన కాలంలో వర్షాలు పడక పోవడమే కారణమని అధికారులు, రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. శామీర్‌పేటకు చెందిన మహిళా రైతు అరుణ మాట్లాడుతూ నెల రోజులుగా వర్షాలు పడక ఆకుకూరల మాల్ దొరకడం లేదని, ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి విక్రయిస్తున్నామన్నారు. ‘ఎండలు తగ్గడం లేదు. సరిగ్గా వానలు పడట్లేదు. వేసిన ఆకు కూరలు ఎండిపోతున్నాయి. బోర్ల కింద పండించి పొలాల నుంచి తెప్పిస్తున్నాం. దీంతో ధర ఎక్కువై ప్రజలు కొత్తమీర కొనడం లేదు’ అని ఎర్రగడ్డ రైతుబజార్‌కు చెందిన ఆకు కూరల వ్యాపారి రాములు చెబుతున్నారు. ఎర్రగడ్డ రైతు బజార్ ఎస్టేట్ అధికారి రమేష్ మాట్లాడుతూ ‘రైతులు కొత్త పంటలు వేయడానికి పొలాలను సిద్ధం చేసుకున్నారు. అయితే సకాలంలో వర్షాలు కరవలేదు. గతేడాది ఈ సమయానికి పంట వేసేవారు. ఈ ఏడాది పాత పంటలు లేవు, వర్షాలు లేక కొత్తగా సాగు చేయలేదు, అందుకే రేట్లు పెరిగాయి’ అని చెప్పారు. కొత్తిమీర కట్ట రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండడంతో అది లేకుండానే వంట చేసుకుంటున్నామని వినియోగదారులంటున్నారు.
కొండెక్కిన కొత్తిమీర
- హైదరాబాద్
- July 5, 2019
లేటెస్ట్
- హైదరాబాద్‌లో ఒక్కరోజే దాదాపు రూ.2 కోట్లు స్వాధీనం
- టాస్ గెలిచిన ఢిల్లీ.. ఇరు జట్లకు కీలక మ్యాచ్
- చంద్రబాబును నమ్మడం అంటే.. కొండశిలువ నోట్లో తలకాయ పెట్టడమే: సీఎం జగన్
- కంట్రోల్ తప్పిన అమిత్ షా హెలీకాప్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం
- ఆర్టీసీ కండక్టర్‌పై మహిళా ప్రయాణికురాలు దాడి
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- కేఎఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని ప్రభుత్వానికి లేఖ
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- SreeLeela: స్టార్ హీరోతో శ్రీలీల ఐటమ్ సాంగ్..ఈ జోడీ డ్యాన్స్ నంబర్‌తో మోతమోగాల్సిందే!
- ఓర్నాయనో.. రోడ్డుపై ట్రక్ టైరు ఊడింది.. విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టి.. ఆ తరువాత..
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్