
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి (2024) గోవాలో జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. వారి ప్రతి ముఖ్యమైన విషయాన్ని తమ అభిమానులతో షేర్ చేసుకుంటూ తమ అన్యోన్యతను పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నటి రకుల్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ఫోటోలు షేర్ చేసింది. వాటికి ఈ క్షణం మరువలేనిది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇపుడా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు రకుల్ షేర్ చేసిన ఫోటోలేంటీ? పెట్టిన క్యాప్షన్ కు అర్ధమేంటనేది? వివరాల్లో చూసేద్దాం..
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం (ఆగస్టు 12న) కజారి తీజ్ జరుపుకుంది. ఈ వేడుకను రకుల్ ప్రీత్ సింగ్ తన అత్త, జాకీ భగ్నానితోతో కలిసి ఆనందంగా సెలెబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఫోటోలను తన అభిమానుల కొరకు ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
ALSO READ : బెట్టింగ్ యాప్స్ కేసు
‘మీ అందరికీ హ్యాపీ తీజ్.. నా పూజ భగ్నానీ (రకుల్ ప్రీత్ సింగ్ అత్త)తో మొదటిసారి తీజ్ జరుపుకుంటున్నాను. ఫస్ట్ టైం అత్తగారు అలాగే జాకీ భగ్నానీతో కలిసి ఈ పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేచి ఉన్న చంద్రుని ముఖం చూడటం కోసం ఎదురుచూడటం ఎంతో అందమైన అనుభవం. ఈ క్షణం మరువలేనిది’ అంటూ రకుల్ క్యాప్షన్ ఇచ్చింది.
షేర్ చేసిన ఈ ఫోటోలలో, రకుల్ ఎరుపు రంగు సల్వార్ కమీజ్‌లో ఆకర్షించేలా కనిపిస్తుంది. పండుగ వాతావరణాన్ని చూపిస్తూ తనలోని ఆనందం, స్వేచ్చని ఈ ఫోటోల ద్వారా చూపించే ప్రయత్నం చేసింది. ఇందులో ఓ ఫొటోలో ఆమె భర్త జాకీ భగ్నాని మరియు అత్తగారు పూజ భగ్నానితో కలిసి కజారి తీజ్ శుభ సందర్భాన్ని చూపిస్తుంది. మరో ఫొటోలో రకుల్ తన భర్త జాకీతో కలిసి ఆర్తి థాలీ పట్టుకుని చంద్రున్నీ చూడటానికి బాల్కనీలో నిల్చున్నారు.
తీజ్ ఎందుకు జరుపుకుంటారు?
తీజ్‌ను ప్రధానంగా ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా వివాహిత మహిళలు జరుపుకుంటారు. వారు తమ భర్తల దీర్ఘాయువు మరియు శ్రేయస్సు కోసం ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. ఇది ప్రేమ, నిబద్ధత మరియు బలమైన కుటుంబ బంధాలను ప్రతిబింబించే పండుగ. రకుల్‌కు, ఈ మొదటి తీజ్ చిరస్మరణీయ అనుభవం.
ఇటీవలే, ఈ జంటకు యోగా దినోత్సవం (జూన్ 21న) సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా "ఫిట్ ఇండియా కపుల్ అవార్డు" ప్రకటించింది.
🙏🏻🙏🏻💪🏼 https://t.co/lesyDkT3hZ
— Rakul Singh (@Rakulpreet) June 21, 2025