సంక్షేమ హాస్టళ్లు పెంచండి..ఆర్.కృష్ణయ్య డిమాండ్

సంక్షేమ హాస్టళ్లు పెంచండి..ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో సీట్లు దొరకక బీసీ విద్యార్థులు కష్టాలు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని 20 శాతం కాలేజీ హాస్టళ్లు పెంచాలని డిమాండ్ చేశారు.

 విద్యానగర్ బీసీ భవన్​లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్​తో సహా రాష్ట్రంలో హాస్టళ్లు తగినంత లేకపోవడంతో విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.