
డైలీ 1,500 నుంచి 2వేల వరకు ఓపీలు
హైదరాబాద్, వెలుగు: రోజురోజుకీ తీవ్రమవుతున్న చలి కారణంగా వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్కు పేషెంట్ల రద్దీ పెరుగుతోంది. డైలీ ఓపీ కేసులు 1,500 నుంచి 2 వేల వరకు ఉంటున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఈఎన్టీ హాస్పిటల్కు సిటీ నుంచే కాకుండా నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా పేషెంట్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
దీంతో హాస్పిటల్‌లోని ఔట్ పేషెంట్ బ్లాక్, ఇన్ పేషెంట్ బ్లాక్‌లు నిండిపోయి కనిపిస్తున్నాయి. చిన్నారులకు అలర్జీ కారణంగా జలుబు వస్తుంటుందని ఈఎన్టీ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. సైనస్, ఆస్తమా ఉన్న వాళ్లు చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.