తెలంగాణ వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణ వ్యాప్తంగా  పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా..పట్టణాల్లో రాత్రి పగటి టెంపరేచర్లు పడిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6గంటలు అయ్యిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతుంది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 10డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు అంటున్నారు.  చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కుమురం భీం అసిఫాబాద్  జిల్లాలో అత్యల్పంగా 9.6డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మంచిర్యాల 9.9, ఆదిలాబాద్ లో 10.5డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. 

తెల్లవారు జామును పొగమంచు కమ్మేయడంతో.. వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగటంతో..వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడుతుందని రైతులు అంటున్నారు.