పెరుగుతున్న విడాకుల కేసులు

పెరుగుతున్న విడాకుల కేసులు

30 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని పెళ్లికాని ప్రసాదులు మొర పెట్టుకుంటుంటే.. పెళ్లైన వారు చీటికి మాటికి గొడవపడి విడాకుల దాకా వెళ్తున్నారు. ఇటీవల చేసిన సర్వేలో విడాకులు తీసుకునేవారు పెరుగుతున్నారే తప్ప తగ్గడంలేదని చెబుతున్నాయి కోర్టులు. తెలంగాణలో విడాకుల కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఆరువేల విడాకుల కేసులు పెండింగ్ లో ఉండగా.. ఇవి ఏటా 20శాతం పెరుగుతుండటం గమనార్హం.

పెళ్లైన ఐదేళ్లలోపు విడిపోవడానికి దంపతులు ఎక్కువగా విడాకులకు దరఖాస్తు చేసుకుంటుండగా.. చిన్న చిన్న కారణాలతో విడాకుల దాకా వెళుతున్నారట. ఒక్క హైదరాబాద్ లోనే 1800 కేసులు కోర్టులో పెండింగ్ లో ఉంటే అందులో వెయ్యి విడాకుల కేసులే ఉండటం పరిస్థితికి అద్దంపడుతొంది.