రేటు పెరిగినా..లాగించేస్తున్నరు

రేటు పెరిగినా..లాగించేస్తున్నరు

హైదరాబాద్, వెలుగు : బిర్యానీ ముడిపదార్థాల ధరలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో చికెన్‌ బిర్యానీ ధరలను పెంచేశారు నిర్వాహకులు. అయినా కొనుగోళ్లలో మాత్రం ఎలాంటి తేడా లేదు.  బిర్యానీ బిజినెస్  మూడు చెస్ట్ పీసులు, ఆరు లెగ్‌ పీసులుగా సాగుతుంది. సిటీలో చిన్న, మధ్య స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు12వేలకు పైనే ఉంటాయి.

వీటిల్లో ప్రతిరోజు 6 నుంచి 7లక్షల బిర్యానీలు అమ్ముతారు. ఇటీవల బాస్మతీ రైస్, మసాలా, మాంసం ధరల్లో  పెరిగాయి. దీంతో ప్రతి బిర్యానీపై అదనంగా రూ. 10 నుంచి రూ. 30లకు పెంచారు విక్రయదారులు.  చిన్న రెస్టారెంట్ లో రూ. 150 లకు దొరికే  ఇప్పుడు రూ. 180లకు చేరింది. దీంతో పెరిగిన ధరలతో బిర్యానీ గిరాకీ పడిపోకుండా యజమానులు  చూస్తున్నారు.

క్వాలిటీ బాస్మతి రైస్ కిలో రూ. 100 నుంచి రూ.150 వరకు లభిస్తుండగా, కిలో చికెన్ ప్రస్తుతం రూ. 180 ఉంది. దీంతో ధరలు పెంచకపోతే నష్టాల్లోనే రెస్టారెంట్ నడిపించాల్సి వస్తుందని లక్డీకాపూల్ లోని ఓ రెస్టారెంట్ యజమాని చెప్పారు. ఇప్పటికే సిటీలో హోటల్ రంగంలో పెరిగిన పోటీతో మార్జిన్ తక్కువైనా నడిపిస్తున్నామని, తాజాగా పెరిగిన అదనపు ఖర్చుల కారణంగా రూ. 10 నుంచి రూ. 30వరకు ధరలు వివరించారు.

బిజినెస్ పెంచుకునే క్రమంలో ఆన్ లైన్ ఆర్డర్లతో నిర్వహణ భారం ఎక్కువైపోగా, ఫుడ్ డెలివరీ కంపెనీలు హోటళ్ల నుంచే కమిషన్ అదనంగా వసూలు చేస్తుండడంతో రేట్లను పెంచక తప్పలేదని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఓ హోటల్ నిర్వాహకుడు చెప్పాడు. పెరిగిన రేటు కూడా ఆన్ లైన్ లో బుకింగ్‌ చేసుకుంటే డిస్కౌంట్లలో తక్కువ ధరలోనే లభిస్తుండగా, ఎక్కువగా ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారని ఫుడ్ డెలివరీ నిర్వాహకుడు తెలిపారు.

చికెన్ బిర్యానీపైనే ఇంట్రస్ట్‌

చికెన్ ధరలు పెరిగినప్పుడు కూడా రూ.180  నుంచి రూ. 220 బిర్యానీ లభించింది. తాజాగా చికెన్ రేటు తగ్గినా నిర్వహణ ఖర్చుల్లో ఏమాత్రం తేడా లేదు. ప్రతి చికెన్ ఫుడ్ ఐటమ్స్ పై మాత్రమే ధరలు పెంచారు. గతంలో రెస్టారెంట్లు, హోటళ్లపై జీఎస్టీ కారణంగా రూ. 20 పెరిగితే, తాజాగా మరోసారి బిర్యానీ ధర పెరిగింది. గతేడాది కంటే చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయని, అందుకే ధరలు పెంచక తప్పలేదని రెస్టారెంట్స్‌ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ మాత్రం ధరలు పెంచకపోతే క్వాలిటీ, టెస్టీ బిర్యాని అందించలేమంటున్నారు.  మటన్ బిర్యానీకి సమానం చికెన్ బిర్యానీ చేరినా, ఎక్కువగా నగరవాసులు చికెన్ బిర్యానీనే లాగించేస్తారంటున్నారు.

క్వాలిటీ మేరకే పెంచాం 

సిటీలో హోటల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో లేదు.  చాలా హోటళ్లు, రెస్టారెంట్లు తక్కువ మార్జిన్ తో బిజినెస్‌ చేస్తున్నాయి.  ముఖ్యంగా జనాల్లో క్వాలిటీ, టెస్టీ చూసేవారు ఎక్కువైపోయారు. దీంతో గిరాకీ పడిపోకుండా ఉండేందుకు ఆ మాత్రం రేట్లకు పెంచాల్సి వచ్చింది.- వెంకట్ రెడ్డి, ప్రెసిడెంట్ రాష్ట్ర హోటల్స్‌ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్‌