త్వరలో ఫిఫా ఫీవర్..

త్వరలో ఫిఫా ఫీవర్..

త్వరలో భారత్లో ఫిఫా ఫీవర్ మొదలు కానుంది. మొట్టమొదటి సారిగా ఇండియాలో ఫిఫా U-17 మహిళల ప్రపంచకప్ జరగబోతుంది.అక్టోబర్ 11 నుంచి 30 వరకు  ఫిఫా U-17 మహిళల ప్రపంచకప్ 2022 టోర్నీని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించనుంది.  భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలోని స్టేడియాల్లో వరల్డ్ కప్
మ్యాచులు జరగనున్నాయి. 

ఏ ఏ దేశాలు పాల్గొంటాయి...
 ఫిఫా U-17 వరల్డ్కప్-2022లో ఇండియాతో సహా మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ చైనా, జపాన్, న్యూజీలాండ్, అమెరికా, కెనడా, మెక్సికో, బ్రెజిల్, చీలీ, కొలంబియా దేశాలకు చెందిన జట్లు వరల్డ్కప్ లో ఆడనున్నాయి. UEFA ఉమెన్స్ అండర్ 17 ఛాంపియన్ షిప్ టోర్నీ తర్వాత ఈ టీమ్స్ భారత్కు చేరుకోనున్నాయి. వీటితో పాటు  కాఫ్ సభ్యదేశాలైన కామెరూన్, టాంజానియా, ఇథియోపియా, నైజీరియా, ఘనా, మోరాకో దేశాలు కూడా వరల్డ్కప్ లో పాల్గొనబోతున్నాయి. అటు UEFA ఉమెన్స్  U-17 ఛాంపియన్‌షిప్ విజేతలు జర్మనీ ఫ్రాన్స్, స్పెయిన్  కూడా టోర్నీలో పాల్గొనబోతున్నట్లు ప్రకటించాయి. ఇక ఈ వరల్డ్కప్నకు సంబంధించి జూన్ 24న స్విట్జర్లాండ్లోని జురిచ్లో డ్రా తీయనున్నారు. నిజానికి ఈ టోర్నీ 2021లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.