IND vs AFG: వావ్.. సూపర్బ్ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర శార్దూల్ ఠాకూర్ విన్యాసాలు

IND vs AFG: వావ్.. సూపర్బ్ క్యాచ్.. బౌండరీ లైన్ దగ్గర శార్దూల్ ఠాకూర్ విన్యాసాలు

వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా అఫ్ఘానిస్థాన్‍తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. బౌండరీ లైన్ దగ్గర విన్యాసాలు చేస్తూ.. రహ్మానుల్లా గుర్బాజ్‌ను పెవిలియన్ చేర్చాడు.    

13వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వేసిన షార్ట్‌ పిచ్‌ బంతిని గుర్బాజ్ సిక్స్‌గా మలచానుకున్నాడు. బంతి కూడా బౌండరీ లైన్ ఆవల పడినట్లు అనిపించినా.. లార్డ్ ఠాకూర్ నియంత్రణతో మంచి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో 63 పరుగుల వద్ద అఫ్గాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది.

ALSO READ: Cricket World Cup 2023: పాలస్తీనాకు మద్దతు తెలిపిన పాక్ క్రికెటర్.. భారత్‌లో ఉన్నన్నాళ్ళు జాగ్రత్త!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

తొలి వికెట్ బుమ్రాదే.. 

ఈ మ్యాచ్‌లో మొద‌ట‌ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్‌కు జస్ప్రీత్ బుమ్రా షాకిచ్చాడు. అఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(22)ను బుమ్రా ఔట్ చేసి భారత జట్టులో ఆనందం నింపాడు. దీంతో అఫ్ఘాన్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.