ఫినిషర్‌‌గా పాండ్యా ధోనీని గుర్తుకు తెచ్చాడు

ఫినిషర్‌‌గా పాండ్యా ధోనీని  గుర్తుకు తెచ్చాడు

సిడ్నీ: హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 42 నాటౌట్) వీరోచిత బ్యాటింగ్‌‌ ప్రదర్శనతో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా గెలుపు సాధించింది. ఈ విక్టరీతో సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌‌లో ఓటమికి బదులు తీర్చుకోవడమే గాక టెస్టు సిరీస్ ముందు విశ్వాసాన్ని కూడగట్టుకుంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌‌ చేసిన తీరుపై ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసలు కురిపించాడు. పాండ్యాను మాజీ కెప్టెన్ ధోనితో పోల్చాడు. పాండ్యా ఫినిషర్‌‌గా ధోనీని మరిపించాడని మెచ్చుకున్నాడు.

‘ఇది అద్భుతమైన మ్యాచ్. పాండ్యా ఎంత ప్రమాదకారో మాకు తెలుసు. గతంలో ధోని ఎలా ఆడేవాడో ఇవ్వాళ పాండ్యా అలాగే బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌‌లో పాండ్యా నిలకడగా రన్స్ చేస్తున్నాడు. ఇవ్వాళ అతడి బ్యాటింగ్ గొప్పగా సాగింది. మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగింది. అయితే టీమిండియాకు అనుభవజ్ఞులైన టీ20 ప్లేయర్లు ఉండటం కలిసొచ్చింది. విరాట్ ఆడిన కొన్ని షాట్లు గత కొన్నేళ్లలో అతడు బెస్ట్ ప్లేయర్‌‌గా ఎదిగిన తీరుకు అద్దం పట్టాయి’ అని లాంగర్ పేర్కొన్నాడు.