IND vs PAK: వీడియో: మహిళా పోలీస్ పట్ల అసభ్య ప్రవర్తన.. చెంప చెల్లుమనిపించింది

IND vs PAK: వీడియో: మహిళా పోలీస్ పట్ల అసభ్య ప్రవర్తన.. చెంప చెల్లుమనిపించింది

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఇండియా- పాకిస్తాన్ ఆశించిన మజాను అందించలేదు. గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 మ్యాచ్ రేంజ్‌లో ఆశిస్తే.. అహ్మదాబాద్ గడ్డపై అంతా రివర్స్ అయ్యింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసేలోపే వార్ వన్ సైడ్ అని తేలిపోయింది. అయితే మ్యాచ్ జరుగుతుండగా ఒక మహిళా పోలీస్.. ప్రేక్షకుడి చెంప చెల్లుమనిపించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఇండియా- పాక్ మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వచ్చిన ఓ ప్రేక్షకుడు.. విధుల్లో ఉన్న మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తించాడట. ఓవైపు హోరీహోరీగా మ్యాచ్ జరుగుతుంటే.. అతడు మాత్రం ఆమె పట్ల అసభ్య పదజాలాన్ని వాడుతూ రెచ్చగొట్టేలా మాట్లాడట. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె సదరు ప్రేక్షకుడి చెంప చెల్లుమనిపించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గొడవకు దారితీసిన విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. వీడియోలో కనిపిస్తున్నదాన్ని బట్టి ప్రేక్షకుడు స్టేడియంలోని స్టాండ్స్‌లో ఓ సీటులో కూర్చొని మ్యాచ్ చూస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఓ మహిళా పోలీస్ అధికారిణి విధులను నిర్వర్తిస్తోంది. ఇంతలో వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, కాసేపు మాటల యుద్ధం జరిగింది. కాసేపటికే పోలీస్ అధికారిణి యువకుడి చెంప పగలగొట్టగా.. ఆ యువకుడు కూడా సదరు మహిళా పోలీస్ పై చేయి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.