IND vs PAK: రిజర్వ్ డే అంటే టీమిండియా ఫ్యాన్స్ కి ఎందుకంత టెన్షన్..?

IND vs PAK: రిజర్వ్ డే అంటే టీమిండియా  ఫ్యాన్స్ కి ఎందుకంత టెన్షన్..?


రిజర్వ్ డే.. ప్రస్తుతం ఈ పదం భారత్ ని కంగారెత్తిస్తుంది. తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్ ని ఈ రోజు కొనసాగించనున్నారు. ప్రస్తుతం పాక్ మీద భారత్ దే పై చేయి అయినా ఫ్యాన్స్ లో ఎక్కడో చిన్న టెన్షన్. కారణం ఏంటి అని పరిశీలిస్తే ఇప్పటివరకు టీమిండియాకు అస్సలు రిజర్వ్ డే కలిసి రాలేదు. రికార్డ్ చూసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. భారత్ 2002 లో తొలిసారి రిజర్వ్ డే లో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. శ్రీలంకపై చాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో తలపడిన భారత్.. కేటాయించిన రిజర్వ్ డే లో వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు. దీంతో ఇరు జట్లు ట్రోఫీని షేర్ చేసుకున్నాయి. 

2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ని ఆ తర్వాత రోజు కొనసాగించారు. ఈ మ్యాచులో స్వల్ప లక్ధ్యాన్ని కూడా భారత చేధించలేక ఓటమిపాలైంది. ఇక 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా న్యూజీలాండ్ పై ఇదే సీన్ రిపీటైంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తాజాగా ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 మ్యాచులో వరుణుడు ఆటను అడ్డుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ఉండడంతో నేడు మ్యాచ్ జరగనుంది. మరి నేటి మ్యాచులోనైనా సెంటి మెంట్ ని మన టీమిండియా బ్రేక్ చేస్తుందో.. లేదో చూడాలి.                  
     

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)