Ind vs Sl: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Ind vs Sl: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

తిరువనంతపురం, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమిండియా సీనియర్ ప్లేయర్లు రెండవ మ్యాచ్ లో ఫెయిల్ అయ్యారు. బౌలింగ్ లో పుంజుకున్న శ్రీలంక ఆఖరి వన్డే ఎలాగైనా గెలవాలని చూస్తుంది. భారత్ సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది. హార్దిక్ పాండ్య స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కి ఈ మ్యాచ్ లో చోటు దక్కింది.

పిచ్ రిపోర్ట్: 

పిచ్ పై పచ్చిక ఏ మాత్రం లేదు. కావున గ్రీన్ ఫీల్డ్ పిచ్ పూర్తిగా స్విన్నర్లకి అనుకూలించవచ్చు. అంతేకాకుండా బ్యాటింగ్ ట్రాక్ లా కూడా కనిపిస్తుంది.  
 

తుది జట్లు: 

శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, కుసల్ మెండిస్(w), అషెన్ బండార, చరిత్ అసలంక, దసున్ షనక(c), వనిందు హసరంగా, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, లహిరు కుమార

భారత్ : రోహిత్ శర్మ(c), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్