అమెరికాను యూఎస్ అంటారా..!: క్రికెటర్ కామెంట్‌తో నెటిజన్ల ఫన్నీ రిప్లైస్

అమెరికాను యూఎస్ అంటారా..!: క్రికెటర్ కామెంట్‌తో నెటిజన్ల ఫన్నీ రిప్లైస్

అమెరికా గడ్డపై ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య నేడు(ఆగష్టు 12) నాలుగో టీ20 జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు కాసేపు ప్రాక్టీస్, మరికాసేపు బీచ్‌ల వెంటతిరుగుతూ ఎంజాయ్ చేశారు. వీరిని మరింత ఉత్తేజ పరచాలన్న ఉద్దేశ్యంతో బీసీసీఐ.. భారత క్రికెటర్లను "యూఎస్‌ఏ(యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా)" అనగానే మీ మైండ్‌లో ముందుగా ఏం గుర్తుకు వస్తుందంటూ ఓ వీడియో షూట్ చేసింది.

ఇందులో భారత క్రికెటర్లు చెప్పిన అభిప్రాయాలు అందరవి ఒకలా ఉంటే.. ముఖేక్ కుమార్ సమాధానం మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ముందుగా టీమిండియా టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందిస్తూ.. యూఎస్‌ఏ చాలా మంది డ్రీమ్‌ అన్నాడు. అంటే ఎంతో మంది అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగం చేస్తూ.. స్థిరపడాలని అనుకుంటారనే ఉద్దేశ్యంలో పాండ్యా ఈమాట చెప్పాడు.

సూర్య.. యూఎస్‌ఏ అనగానే తనకు ఐస్‌ క్రీమ్స్‌ గుర్తు వస్తాయని చెప్పగా.. చాహల్ GTA గుర్తొస్తోందని తెలిపాడు. ఇక శుబ్‌మన్‌ గిల్‌.. తమ బంధువులు చాలా మంది ఇక్కడే ఉన్నారని, యూఎస్‌ఏ అనగానే తనకు చుట్టాలు గుర్తుకు వస్తారని అన్నాడు. ఇక యువ క్రికెటర్‌ ముఖేష్‌ కుమార్‌ వంతు రాగానే.. తనకు అమెరికా అనే చాలా కాలంగా తెలుసని, అయితే యూఎస్‌ఏ అంటే అమెరికా అని ఈ మధ్యనే తెలిసిందని అన్నాడు.

అతని మాటలు విన్న నెటిజన్స్.. అతని అమాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అవును అవును.. భారత్‌ను ఇండియా అంటారని తెలియదు కదా నీకు.. తొందరలో అది కూడా తెలుస్తుందిలే అంటూ చురకలు అంటిస్తున్నారు. అంతేనా.. పాకిస్తాన్‌ను పాక్ అంటారని కూడా తెలియనంత అమాయకుడివి కదా నువ్వూ అంటూ ఫర్నీ రిప్లయిస్ ఇస్తున్నారు. పోనీ ఇంగ్లాండ్ ను యూకే అంటారన్న విషయమైనా తెలుసా? నీకు అంటూ మరికొందరు దెప్పిపొడుతున్నారు.