
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ గిల్ సెంచరీ తర్వాత 518 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో రోజు మధ్యాహ్నం వరకే కెప్టెన్ గిల్ సెంచరీ తర్వాత.. ధృవ్ జురెల్ ఔటైన తర్వాత 134.2 ఓవర్ల వద్ద మొత్తం 5 వికెట్ల నష్టానికి 518 రన్స్ చేసి డిక్లేర్ చేసింది ఇండియా.
వెస్టిండీస్ తో జరుతున్న రెండో టెస్టులో సెంచరీల మోత మోగుతోంది. యశస్వీ జైస్వాల్ తర్వాత కెప్టెన్ గిల్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. క్లాస్ బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సెంచరీ చేసుకున్నాడు. మొత్తం 177 బంతులలో 13 ఫోర్లు, ఒక సిక్సుతో సెంచరీ పూర్తి చేశాడు. 130 వ ఓవర్లో 5వ బాల్ కు.. ఖేరీ పియరీ వేసిన బాల్ ను లెఫ్ట్ కవర్స్ వైపు పంపించి మూడు రన్స్ తీసిన గిల్.. ఈ టెస్టులో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టెస్టుల్లో గిల్ కు ఇది పదో సెంచరీ. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఇది ఐదో టెస్టు సెంచరీ. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఇండియా కెప్టెన్ కు ఇది 5వ టెస్టు సంచరీ కావడం విశేషం. అంతకు ముందు ఇదే ఫీట్ ను విరాట్ కోహ్లీ వరుసగా 2017, 2018లో సాధించాడు. టెస్టులలో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఐదు సెంచరీలు చేసిన కోహ్లీ ఫీట్ ను సమం చేశాడు గిల్. కేవలం 7 టెస్టులలో 5 సెంచరీలు నమోదు చేయడం విశేషం.
అంతకు ముందు రెండో రోజు (అక్టోబర్ 11) ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అవుటయ్యాడు. 175 వ్యక్తిగ స్కోర్ దగ్గర రనౌట్ తో వెనుదిరిగాడు యశస్వీ. గిల్, యశస్వీ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ తో ఇండియా వికెట్ కోల్పోయింది.
రెండో రోజు ఆట ఆరంభంలో 91.2 ఓవర్ లో జైడెన్ సీల్స్ వేసిన బాల్ ను మిడ్ ఆఫ్ సైడ్ డ్రైవ్ గా మలిచాడు జైస్వాల్. క్విక్ సింగిల్ కోసం కాల్ ఇచ్చి వేగంగా ముందుకు వెళ్లాడు. ఫీల్డర్ చేతిలో బాల్ ఉండటం చూసి రెండు అడుగులు వేసిన గిల్.. మళ్లీ వెనక్కి వెళ్లాడు. దీంతో మిడ్ ఫీల్డర్ చందర్ పాల్ రనౌట్ చేయడంతో జైస్వాల్ వెనుదిరిగాడు.
ALSO READ : గిల్ సెంచరీ.. ఇండియా 500 పరుగులు
శుక్రవారం (అక్టోబర్ 10) ఆటలో 173 రన్స్ చేసిన జైస్వాల్.. రెండో రోజు ఆరంభంలోనే కేవలం రెండు రన్స్ మాత్రమే సాధించి 175 ( 258 బాల్స్ లో 22 ఫోర్లతో 175 రన్స్) దగ్గర ఔటయ్యాడు.
మంచి ఊపుమీదున్న జైస్వాల్.. కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తాడని అందరూ భావించారు. 300 పైనే స్కోర్ చేస్తాడని సీనియర్స్ అంచనా వేశారు. కానీ 175 దగ్గర ఔటవ్వడంతో డబులు సెంచరీ మిస్ చేసుకున్నాడు.