ఆడియో లీక్​ : సాయమడిగిన మహిళను వేధించిన ​ఉపసర్పంచ్

ఆడియో లీక్​ : సాయమడిగిన మహిళను వేధించిన ​ఉపసర్పంచ్

వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఉప సర్పంచ్ ఆగడాలు మితిమీరాయి. సహాయం చేయాలని అడిగిన ఓ మహిళతో అతడు అసభ్యంగా మాట్లాడాడు. పానగల్ మండలం జమాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఉప సర్పంచ్.. ఓ మహిళకు ఫోన్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. “సమస్యలో ఉన్నాను.. సాయం చేయండి” అని అడిగిన ఆమెను బెదిరించాడు. స్థలం ఇప్పించాలని కోరిన వితంతువుతో.. టీఆర్ఎస్ ఉప సర్పంచ్ అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీక్ అయింది. 

బాధిత మహిళ చెప్పిన స్థలంలో ఉన్నానని ఆమెకు ఫోన్ చేశాడు. తాను చెప్పినట్లు చేస్తే.. చిటికెలో సమస్య పరిష్కరిస్తానని పచ్చిగా మాట్లాడాడు. లేదంటే జీవితంలో ఆ స్థలం ఆమెకు దక్కకుండా చేస్తానని టీఆర్ఎస్ ఉప సర్పంచ్ బెదిరించాడు. చెప్పుకునే దిక్కులేక బాధిత మహిళ... సదరు ఉప సర్పంచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ అవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఉప సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి పై చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.