లోక్ సభలో వినూత్న నిరసన :రీ-నీట్ టీషర్ట్ తో ప్రమాణం చేసిన ఎంపీ 

లోక్ సభలో వినూత్న నిరసన :రీ-నీట్ టీషర్ట్ తో ప్రమాణం చేసిన ఎంపీ 

నీట్ పేపర్ లీక్ పై లోక్ సభలో వినూత్న నిరసన తెలిపారు ఓ ఇండిపెండెంట్ ఎంపీ. మంగళవారం (జూన్ 25) లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా లోక్ సభ సభ్యులు ప్రమాణం చేశారు. బీహార్ కు చెందిన ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ ఎంపీగా ప్రమాణం చేస్తున్న సందర్భంలో రీ-నీట్ అని రాసివున్న టీషర్ట్ ధరించి నిరసన తెలిపారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి అంటూ నినాదాలు చేశారు.

దీంతో సభలో కేంద్ర మంత్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో కాసేపు సభలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. మీరు ఎంత మంది ఉన్నా.. నెనొక్కడినే పోరాడతా.. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నాకు మీకు చెబుతున్నారా అని మంత్రులకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ పప్పూ యాదవ్.