కోహ్లీకే చుక్కలు చూపించిన యంగ్ పేసర్: నెట్స్‌లో రోహిత్-విరాట్‌ల పైఫైట్.. వాళ్లకు సీరియస్ వార్నింగ్!

కోహ్లీకే చుక్కలు చూపించిన యంగ్ పేసర్: నెట్స్‌లో రోహిత్-విరాట్‌ల పైఫైట్.. వాళ్లకు సీరియస్ వార్నింగ్!

Virat Kohli Frustrated: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగుస్తుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు వన్డే సిరీస్‌పై పడింది. టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్ ప్లేయర్లు ఈరోజు (2026, నవంబర్ 1, ఆదివారం) ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. మొదటి వన్డేకు మరో 3 రోజులే సమయం ఉండటంతో లోకల్ కండిషన్స్‌కు అలవాటు పడేందుకు హెడ్ కోచ్‌తో పాటు స్టార్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

కోహ్లీకే చుక్కలు చూపించిన యంగ్ పేసర్: 

గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో భారత్ ఎ టీమ్ నుంచి వన్డే జట్టులోకి వచ్చిన జమ్మూ కాశ్మీర్ యంగ్ పేసర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) నెట్స్‌లో దుమ్మురేపాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు రాగా.. ఆకిబ్ నబీ నిప్పులు చెరిగే బంతులతో విరాట్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. వరుసగా బంతిని ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ చేస్తూ కోహ్లీ ప్యాడ్లను బాదడమే కాకుండా.. పదే పదే అవుట్‌సైడ్ ఎడ్జ్ తీస్తూ కంగారు పెట్టాడు. ఈ యంగ్ బౌలర్ వేసే లైన్ అండ్ లెంగ్త్‌కు బీట్ అవ్వడంతో కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అయితే కొద్దిసేపటికే తనదైన క్లాస్ షాట్లతో పుంజుకున్న విరాట్, ఆ తర్వాత బౌండరీ వెనుక రోహిత్ శర్మతో కలిసి సరదాగా చిట్‌చాట్ చేస్తూ కనిపించాడు.

గుర్‌నూర్, కంబోజ్ విజృంభణ.. రోహిత్ రిలాక్స్: 

కోహ్లీ-రోహిత్‌లకు సవాల్ విసిరేందుకు మేనేజ్‌మెంట్ యంగ్ పేసర్లు గుర్‌నూర్ బ్రార్, అన్షుల్ కంబోజ్‌లను దింపింది. గుర్‌నూర్ బ్రార్ తన ఎత్తును ఉపయోగించుకుని ఎక్స్‌ట్రా (Extra) బౌన్స్‌తో టీమిండియా బ్యాటర్లను భయపెట్టగా, అన్షుల్ కంబోజ్ పక్కా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. అతడి బౌలింగ్ ఓ రోహిత్ శర్మ ఎక్కువగా అటాకింగ్ చేయకుండా, డిఫెన్స్‌కే ఆధిక ప్రాధాన్యత ఇస్తూ పిచ్ పేస్‌ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. కాగా, ఈ ప్రాక్టీస్ సెషన్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరంగా ఉండగా.. లేట్‌గా వచ్చిన కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్‌లు నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపారు.