నదీమ్‌ పాంచ్‌ పటాక: విండీస్‌‌పై ఇండియా-ఎ గెలుపు

నదీమ్‌ పాంచ్‌ పటాక: విండీస్‌‌పై ఇండియా-ఎ గెలుపు

    3 మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 1-0 ఆధిక్యం

నార్త్‌‌ సౌండ్‌‌ (అంటిగ్వా): ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొట్టిన ఇండియా–ఎ.. వెస్టిండీస్‌‌–ఎతో జరిగిన అనధికార తొలి టెస్ట్‌‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో టీమిండియా 1–0 ఆధిక్యంలో నిలిచింది.  విండీస్‌‌ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప టార్గెట్‌‌ను శనివారం నాలుగో రోజు ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌లో 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈశ్వరన్‌‌ (27), కేఎస్‌‌ భరత్‌‌ (28), విహారి (19) రాణించారు. ప్రియాంక్‌‌ పాంచల్‌‌ (5) నిరాశపర్చాడు. అంతకుముందు విండీస్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లో 77 ఓవర్లలో 180 రన్స్‌‌కు ఆలౌటైంది. స్పిన్నర్‌‌ నదీమ్‌‌ (5/47), సిరాజ్‌‌ (3/38) బౌలింగ్‌‌లో దుమ్మురేపారు. 51 పరుగులకే సొలోజనో (11), హోడ్జ్‌‌ (36) ఔటైనా.. బ్రూక్స్‌‌ (53), ఛేజ్‌‌ (32) మూడో వికెట్‌‌కు 79 రన్స్‌‌ జత చేసి ఇన్నింగ్స్‌‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరి నిలకడతో విండీస్‌‌ ఓ దశలో 159/4 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ సిరాజ్‌‌, నదీమ్‌‌ దెబ్బకు కరీబియన్‌‌ టీమ్‌‌ 21 రన్స్‌‌ తేడాతో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 312 పరుగులు సాధించింది.