
కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ భరతం పడుతుంది ఇండియా. పహల్గామ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయున భారత్‌కు చెందిన పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. తరువాత జరిగిన పరిణామాలతో పాక్ కకావికలమై పోయింది.. ఇంకా అలానే ఉంది కూడా.. ఈ క్రమంలో ఓ పక్క మేకపోతు గాంభీర్యం ప్రదరిస్తూ.. మరోపక్క అమెరికాను ప్రాధేయపడింది.
అమెరికా విదేశాంగ ప్రధాన కార్యదర్శి రూబేనా ... ట్రంప్ ఆదేశాల మేరకు ఇరు దేశాల ప్రతినిథులతో చర్చిస్తున్నారు. దశాబ్దాలుగా భారత్.. పాకిస్తాన్ మధ్య గొడవలున్నాయని.. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. రెండు దేశాల నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ.. కాల్పులను విరమించాలని పాకిస్తాన్ కు సూచించారు. పాక్ ఆర్మీ చీఫ్‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. ట్రంప్ కూడా ఇరుదేశాలు సంయమనం పాటించాలని చెప్పారని రుబేనా సూచించారు.