స్టేడియంలో అభిమానుల నిలువు దోపిడీ

స్టేడియంలో అభిమానుల నిలువు దోపిడీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడాలని ఉప్పల్ స్టేడియానికి వచ్చిన  క్రికెట్​ఫ్యాన్స్​ నిట్టనిలువు దోపిడీకి గురయ్యారు. ఎన్నో ఇబ్బందులు పడి టికెట్లు సంపాదించిన వాళ్లు స్టేడియంలో వాటర్​, కూల్​ డ్రింక్స్‌‌‌‌, ఫుడ్‌‌‌‌ ఐటమ్స్ ​రేట్లు చూసి షాకయ్యారు.  పోలీసులు బయటి నుంచి వాటర్, తినుబండారాలను స్టేడియంలోకి అనుమతించలేదు. దాంతో స్టేడియంలో హెచ్​సీఏ అనుమతితో వచ్చిన ఫుడ్​ వెండర్లు భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. 300 ఎంఎల్​ నీళ్లను రూ. 20కి విక్రయించారు. అంటే లీటర్‌‌‌‌కు రూ. 70. వాటిని కూడా బాటిళ్లలో కాకుండా విడిగా ప్లాస్టిక్​ గ్లాసుల్లో అమ్మారు.  నిజానికి ప్రేక్షకులకు హెచ్​సీఏనే ఉచితంగా తాగు నీరు అందించాలి. కూల్ డ్రింక్స్​ (400 ఎంఎల్​ రూ. 50), ఇతర ఫుడ్​ ఐటమ్స్​ను డబుల్, ట్రిపుల్​ రేట్లకు అమ్మారు. ఇక స్టేడియంలోని బాత్‌‌‌‌రూమ్స్‌‌‌‌లో నీళ్లు రాక ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు.