
- టీ20ల్లోకి క్రాంతి గౌడ్, సయాలీ, శ్రీ చరణి, సుచి
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ విమెన్స్‌తో జరిగే ఐదు టీ20లు, మూడు వన్డేలకు ఇండియా జట్టును ప్రకటించారు. దాదాపు ఏడు నెలల తర్వాత అటాకింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మకు టీ20 జట్టులో చోటు దక్కింది. గతేడాది జరిగిన విమెన్స్ టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరమైన షెఫాలీ.. డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 304 రన్స్ చేసింది. దీంతో మెగా లీగ్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్లలో నాలుగో ప్లేస్‌లో నిలిచింది.
మణికట్టు గాయంతో జట్టుకు దూరమైన వికెట్ కీపర్ యాస్తిక భాటియాకు కూడా పిలుపు అందింది. అయితే షెఫాలీ మాదిరిగా కాకుండా యాస్తికాను టీ20లతో పాటు వన్డేల్లోకి తీసుకున్నారు. రెండో వికెట్ కీపర్‌గా రిచా ఘోష్‌కు చాన్స్ ఇచ్చారు. టీ20లకు 15, వన్డేలకు 16 మందితో కూడిన జట్లను ఎంపిక చేశారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానా వ్యవహరించనున్నారు.
యంగ్ ఓపెనర్ ప్రతీకా రావల్‌ను వన్డేలకు పరిమితం చేశారు. 2023 టీ20 వరల్డ్ కప్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన స్నేహ్ రాణాకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్స్ క్రాంతి గౌడ్, సయాలీ, లెఫ్టార్మ్ స్పిన్నర్లు శ్రీచరణి, సుచి ఉపాధ్యాయకు తొలిసారి టీ20ల్లో చోటు కల్పించారు. జూన్ 28, జులై 1, 4, 9, 12న టీ20లు వరుసగా ట్రెంట్ బ్రిడ్జ్, బ్రిస్టల్, లండన్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్‌లో జరుగుతాయి. జులై 16, 19, 22న జరిగే వన్డే మ్యాచ్‌లకు సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్ లీ స్ట్రీట్ ఆతిథ్యమివ్వనున్నాయి.
టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, సుచి ఉపాధ్యాయ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్గరే.
వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రొడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, తేజల్ హసబిన్స్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, సుచి ఉపాధ్యాయ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్గరే.