ఉక్రెయిన్ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన

ఉక్రెయిన్ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన

ఉక్రెయిన్ లో కొనసాగుతున్న పరిస్థితిపై భారత్  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని  UNSC అరియా- ఫార్ములా సమావేశంలో ఇండియా ప్రతినిధి ప్రతీక్ మాథుర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారన్నారు. భయంతో యుక్రెయిన్ ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారని ఆయన తెలిపారు. శాంతిమార్గంలో రష్యా వ్యవహరించాలని భారత్  ప్రతీ వేదికపై  చెప్తుందని గుర్తు చేశారు. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు ప్రతీక్ మాథుర్. దౌత్యపరమైన చర్చలకు తాము  మద్దతిస్తామన్నారు. ఐక్యరాజ్యసమితి లోపల, బయట నిర్మాణాత్మకంగా వ్యవహరించడం భారత్ పని అని ప్రతీక్ మాథుర్ అన్నారు.