
ఆస్టానా: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో ఇండియా బాక్సర్లు అదరగొట్టారు. సాక్షి (54 కేజీ), జాస్మిన్ (57 కేజీ), నుపుర్ (80+ కేజీ) స్వర్ణాలు సాధించగా ఇండియా మొత్తం 11 పతకాలు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సాక్షి 5–0తో అమెరికాకు చెందిన యోస్లిన్ పెరెజ్‌ను చిత్తు చేయగా.. జాస్మిన్ 4–1తో జుసియెలీన్ సెక్వెరా (బ్రెజిల్)ను ఓడించింది. నుపుర్ 5–0 తో కజకిస్తాన్ బాక్సర్ యెల్దానా తాలిపోవాను చిత్తు చేసింది.
కానీ, మీనాక్షి (48 కేజీ), పూజా రాణి (80 కేజీ) ఫైనల్ బౌట్లలో ఓడి రజతాలు అందుకున్నారు. మెన్స్ కేటగిరీలో జుగ్నూ (85 కేజీ), హితేష్ గులియా (70 కేజీ), అభినాష్ జమ్వాల్ (65 కేజీ) ఫైనల్లో ఓడి రజతాలతో తిరిగొచ్చారు. సెమీస్‌లో ఓడిన నిఖిల్ దూబే (75 కేజీ), నరేందర్ (90+ కేజీ), సంజు (విమెన్స్ 60 కేజీ) కాంస్యాలు రాబట్టారు.