ఉల్లిపై నిషేధం.. వచ్చే ఏడాది వరకు..!

ఉల్లిపై నిషేధం.. వచ్చే ఏడాది వరకు..!

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. 2024.. మార్చి వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది. ఉల్లి ఎగుమతులపై నిషేధంతో.. ధరలను కట్టడి చేయటానికే అంటూ స్పష్టం చేసింది కేంద్రం. ఈ మేరకు డిసెంబర్ 8వ తేదీ జీవో జారీ చేసింది. ఇక నుంచి మన దేశంలో పండే ఎలాంటి ఉల్లినైనా.. ఎగుమతి చేయటానికి వీల్లేదు. 

పెరుగుతున్న  ఉల్లి రేట్లను  తగ్గించడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  అయితే ఇతర దేశాలు కోరితే.. కేంద్ర భుత్వం అనుమతి మేరకు ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్ టీ) నోటిఫికేషన్ లో తెలిపింది. 

ప్రస్తుతం భారతదేశంలోని రిటైల్ మార్కెట్‌లో ఉల్లిపా ధర కిలో రూ.60  పలుకుతోంది. కొన్ని చోట్ల మార్కెట్లో రూ.80 దాకా ఉంది. 2023 ఆగస్టులో ఉల్లి ఎగుమతిపై 40 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది.  దాన్ని మళ్లీ అక్టోబర్ సవరించి ఉల్లి కనీస ఎగుమతి ధరను(MEP)   టన్నుకు 800 గా నిర్ణయించింది.  లేటెస్ట్ గా నిషేదం అమల్లోకి తెచ్చింది.

2022-23లో కేంద్ర ప్రభుత్వం 2.51 లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ గా ఉంచింది. 2023-24లో  సీజన్ లో  3 లక్షల టన్నుల ఉల్లిని బఫర్ స్టాక్ గా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది.